: వేవ్ ఎలక్ట్రానిక్స్ కి 13, టెక్ మహీంద్రాకు 10 ఎకరాలు: చంద్రబాబు
వేవ్ ఎలక్ట్రానిక్ సెజ్ కు 13 ఎకరాలు, టెక్ మహీంద్రాకు 10 ఎకరాలు, విప్రోకు ఏడున్నర ఎకరాలు కేటాయించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. విశాఖలో రేపు మంత్రుల బృందం పర్యటిస్తుందని ఆయన చెప్పారు. సెజ్ ల ఏర్పాటు ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, 13 వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని బాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు.