: మహిళను తొక్కి చంపిన ఏనుగులు


పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జలపాయ్ గురి జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో ఓ మహిళ మృతి చెందింది. మారాఘాట్ రేంజ్ ప్రాంతంలో ఏనుగులు గీతా ఓరావన్ అనే మహిళపై దాడి చేసి తొక్కి చంపినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. గీతా ఓరావన్ వయసు 22 సంవత్సరాలు. వంట చెరుకు సేకరణ కోసం సోమవారం అడవికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అటవీ ప్రాంతంలో సెర్చింగ్ మొదలుపెట్టిన అధికారులు మారాఘాట్ రేంజ్ లో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. పూర్తిగా చిధ్రమైన ఆమె శవాన్ని పోస్ట్ మార్టమ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News