: వైఎస్ కు భయపడి అప్పట్లో ఎవరూ నోరెత్తలేదు: రామచంద్రయ్య
జగన్ అక్రమాస్తుల వ్యవహారం తాజాగా మంత్రివర్గంలో ప్రకంపనలు పుట్టిస్తోన్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య స్పందించారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అనుమతితోనే దోపిడీ యధేచ్చగా సాగిందని మంత్రి వెల్లడించారు. అయితే, నోరు విప్పితే ఏమవుతుందో అని అందరూ వైఎస్ కు భయపడ్డారని ఆయన వివరించారు. తాను అప్పుడే వైఎస్ అవినీతిపై ఎలుగెత్తానని, అయితే ఎవరూ పట్టించుకోలేదని మంత్రి అన్నారు. ఇప్పుడవన్నీ వెలుగులోకి వస్తున్నాయని ఆయన చెప్పారు.