: విజయవాడ చుట్టూ ఔటరు రింగ్ రోడ్డు: మంత్రి నారాయణ


విజయవాడ నగరం చుట్టూ 184 కి.మీ. పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. ఈ రింగ్ రోడ్డు లోపలే రాజధాని ఉంటుందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రూ.90 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా వేసినట్లు నారాయణ చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం అధ్యయనానికి ప్రత్యేక బృందం త్వరలో సింగపూర్ లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. సింగపూర్ తో పాటు మరో మూడు దేశాల్లో పర్యటించి... ఈ బృందం అధ్యయనం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News