: శ్రీశాంత్ కు బీసీసీఐ వార్నింగ్
'చెంపదెబ్బ' వివాదాన్ని మళ్ళీ తిరగదోడి మరో వివాదానికి తెరదీసిన పేసర్ శ్రీశాంత్ కు నేడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఉదంతంపై మరోసారి నోరువిప్పితే షోకాజ్ నోటీసు అందుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. రెండ్రోజుల క్రితం శ్రీశాంత్ ట్విట్టర్లో హర్భజన్ పై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
హర్భజన్ ను 'నమ్మించి గోతులు తీసే వ్యక్తి'గా శ్రీ పేర్కొన్నాడు. 2008 ఐపీఎల్ సీజన్ సందర్భంగా తనను భజ్జీ చెంపదెబ్బ కొట్టలేదని, మోచేతితో నెట్టాడని కూడా ట్విట్టర్లో వివరించాడు. అయితే, ఈ వ్యాఖ్యలను బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. ఇక తాజా ఐపీఎల్ సీజన్లో దూకుడుగా ప్రవర్తించిన కోహ్లీ, గంభీర్ లను సరిగా నడుచుకోవాలంటూ బీసీసీఐ మందలించింది.