: విజయనగరం జిల్లాలో కుండపోత... అన్నదాతల్లో వెల్లివిరిసిన ఆనందం
విజయనగరం జిల్లా, బలిజపేట మండలంలో నిన్న సాయంత్రం నుంచి నేటి ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. ఇవాళ ఉదయానికి 10.2 సెం.మీ. వర్షపాతం రికార్డు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వానల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు ఈ వర్షంతో సంతోషం వ్యక్తం చేశారు. వర్షం కురవడంతో అన్నదాతలు ఆనందంగా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వరినాట్లు వేసేందుకు వారు ముందుకు కదిలారు.