: పోలవరంతో ఎవరికీ నష్టం లేదు: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ ఒక్కరికీ నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. మంగళవారం కేఎల్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల వారికి తమ ప్రభుత్వం పూర్తిస్థాయి పునరావాసం కల్పించనుందని వెల్లడించారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కేఎల్ రావు కలలుగన్న పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని బాబు పేర్కొన్నారు.