: ఆనంకు బ్రదర్ స్ట్రోక్


జగన్ ను ఉరితీయాలంటూ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సోదరుడు జయకుమార్ రెడ్డి ఖండించారు. వైఎస్ కుటుంబం తమను సొంత సోదరుల్లా చూసుకున్నారని, అంత ఆప్యాయంగా, ఇంట్లో మనుషుల్లా చూసుకున్న కుటుంబంపై రామనారాయణ రెడ్డి ఆరోపణలు చేయడం దారుణమని జయకుమార్ రెడ్డి అన్నారు. గతంలో జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని హెచ్చరించిన వ్యక్తి నేడు ఇలా మాట్లాడతాడని ఊహించలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఒకప్పుడు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పనిచేయడం మహాభాగ్యమని చెప్పిన నాయకులు ఆయన మరణానంతరం జగన్ కు మద్దతిచ్చారని గుర్తు చేశారు. అయితే, రాజశేఖరరెడ్డితో తమకున్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా రామనారాయణరెడ్డి చవకబారు ఆరోపణలు చేయడాన్ని భరించలేకపోతున్నట్టు జయకుమార్ రెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News