: తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనుమతి
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పూర్తయింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం ఈ ఉదయం నుంచి శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 25 గంటల సమయం, నడకదారి భక్తుల దివ్యదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.