: ఆటతీరు మార్చుకో... లేకపోతే దిగిపో: కుక్ పై మండిపడ్డ బాయ్ కాట్
ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ ఆటతీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ మండిపడ్డాడు. ముందుండి నడిపించాల్సిన వ్యక్తే విఫలమైతే... జట్టును నడిపించేదెవరు? అంటూ విరుచుకుపడ్డాడు. రెండో టెస్టులో కూడా విఫలమైతే... కెప్టెన్ గా కుక్ కు ఉద్వాసన పలకాలని సెలక్టర్లకు సూచించాడు. దీనికితోడు భారత్, ఇంగ్లండ్ ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ కు వేదికైన నాటింగ్ హామ్ పిచ్ పై కూడా ఈ మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి నిర్జీవమైన పిచ్ లకు ముగింపు పలకాలని తెగేసి చెప్పాడు. ఇలాంటి పిచ్ లపై బౌలింగ్ చేయడం సీమర్లకు కష్ట సాధ్యమని... వారు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు. ఎంతో వెచ్చించి టికెట్లు కొని మ్యాచ్ ఎంజాయ్ చేద్దామని వచ్చే ప్రేక్షకులను ఇలాంటి పిచ్ లు అలరించలేవని బాయ్ కాట్ చెప్పాడు.