: 'చలో ఆస్ట్రేలియా' అంటున్న భారత పర్యాటకులు
భారత పర్యాటకులు ఇటీవల ఆస్ట్రేలియా దేశాన్ని ఎక్కువగా సందర్శిస్తున్నారట. ఈ విషయాన్ని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి-మే మధ్యకాలంలో కంగారూ దేశాన్ని 82,500 మంది భారతీయులు సందర్శించారు. గతేడాదితో పోల్చితే ఇది 19.4 శాతం ఎక్కువని ఆస్ట్రేలియా టూరిజం శాఖ తెలిపింది. ఒక్క మే నెలలోనే 21,700 మంది భారతీయులు ఆసీస్ టూర్ కు వెళ్ళడం విశేషం. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్ళే పర్యాటకుల పరంగా భారత్ ది పదోస్థానం. ఈ జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. తొలి ఐదు నెలల్లో ఆ దేశం నుంచి అత్యధికంగా 4,65,000 మంది పర్యాటకులు ఆస్ట్రేలియాను చుట్టేశారట. ఈ విషయంలో జపాన్, సింగపూర్, మలేసియా వంటి దేశాలు భారత్ కంటే ముందున్నాయి.