: కోచ్ పదవి నుంచి తప్పుకున్న స్కొలారీ


ఫిఫా వరల్డ్ కప్ లో దారుణ పరాభవాల ఫలితం బ్రెజిల్ జట్టు కోచ్ పదవికి లూయిస్ ఫిలిప్ స్కొలారీ రాజీనామా చేశాడు. బ్రెజిల్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత దారుణ ఫలితాలు చవిచూసిన దరిమిలా స్కొలారీ తప్పుకోవాలంటూ విమర్శలు మిన్నంటాయి. సెమీస్ లో జర్మనీ చేతిలో 1-7తో ఓటమి బ్రెజిలియన్లను నిర్ఘాంతపరచగా... మూడోస్థానం కోసం పోరులో నెదర్లాండ్స్ చేతిలోనూ చిత్తవడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఇదంతా స్కొలారీ చేతగానితనం వల్లేనని మాజీలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంతో స్కొలారీ పదవికి గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని బ్రెజిల్ ఫుట్ బాల్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు జోస్ మరియా మారిన్ మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News