: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో హరీష్ రావు భేటీ
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఢిల్లీలో సమావేశమయ్యారు. కల్వకుర్తి, ప్రాణహిత, దేవాదుల ప్రాజెక్టులకు అటవీ శాఖ అనుమతిని తక్షణమే ఇవ్వాలని ఆయన కోరారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన ముగించుకుని రేపు హైదరాబాదుకు వస్తున్నారు. ఆయన ఢిల్లీలో మరో కేంద్రమంత్రి ఉమాభారతితో కూడా సమావేశమయ్యారు.