: ఐశ్వర్యారాయ్ మాకెంతో ఆత్మీయురాలు: ఫ్రాన్స్ రాయబారి
ఈ ఏడాది చివరిలో ఫ్రాన్స్ లో జరగబోయే కేన్స్ ఫిల్మ్ పెస్టివల్ కు ఐశ్వర్య రాయ్ కు ప్రత్యేక ఆహ్వానం అందనుంది. ఇదే విషయాన్ని భారత్ లో ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచెర్ ను మీడియా ప్రశ్నించగా.. ఐశ్వర్యకు ఫ్రాన్స్ ఎంతో గౌరవం ఇస్తుందని చెప్పారు. 'ఆమె మాకెంతో ఆత్మీయురాలు' అన్నారు. ''ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ సినిమాపై(వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా) ప్రత్యేక దృష్టి సారించనున్నాం. భారతీయ నటీనటులను ఆహ్వానిస్తాం. ఐశ్వర్యరాయ్ కు కూడా ఆహ్వానం పలుకుతాం'' అని ఫ్రాంకోయిస్ చెప్పారు.