: ఇక ఎలక్ట్రిక్ బస్సులు!
ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ బైక్ లతో పాటు కార్లనూ చూశాం. ఇకపై ఎలక్ట్రిక్ బస్సులను కూడా చూడబోతున్నాం. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో. గుజరాత్ రాజధాని గాంధీనగర్ - అహ్మదాబాద్ ల మధ్య ఈ తరహా బస్సులు కొద్ది రోజుల్లోనే రోడ్డెక్కనున్నాయి. ఈ నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని గుజరాత్ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.