: 'వినోద్ కాంబ్లీ కనిపించుట లేదు'... పేపర్లో యాడ్ ఇచ్చిన బ్యాంకు
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కనిపించడంలేదని, అతనో డిఫాల్టర్ (ఎగవేతదారుడు) అని ముంబయిలోని డోంబీవాలీ సిటీ సహకార బ్యాంకు వార్తాపత్రికలో ప్రకటన జారీచేసింది. కాంబ్లీ, అతని భార్య ఆండ్రియా లోన్ తీసుకుని రుణ వాయిదాలు చెల్లించలేదని బ్యాంకు పేర్కొంది. రుణ ఎగవేతపై కాంబ్లీ దంపతుల నుంచి స్పందన కరవైందని, అందుకే పేపర్లో ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని బ్యాంకు వివరించింది. అంతేగాకుండా, ఈ క్రికెటర్ ఎక్కడున్నాడో ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం అందించాలని కూడా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది.