: దీక్ష ముగించిన డిగ్గీ రాజా
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ తన ఏడురోజుల నిరశన దీక్షను ముగించారు. పంట నష్టపోయిన రైతులను మధ్యప్రదేశ్ సర్కారు ఆదుకోవాలని, ఎంపీపీఈబీ స్కాంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ డిగ్గీ రాజా దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. గుణా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు దీక్షకు ఉపక్రమించిన దిగ్విజయ్... కుమారుడు జైవర్థన్ సింగ్ (ఎమ్మెల్యే), సోదరుడు లక్ష్మణ్ సింగ్ (మాజీ ఎంపీ), రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామేశ్వర్ నీఖ్రా సమక్షంలో ఆదివారం నాడు దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుణా జిల్లా పాలక వ్యవస్థ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను తప్పుదోవపట్టిస్తోందని ఆరోపించారు. 15 రోజుల్లోగా రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే తాను కోర్టుకు వెళతానని డిగ్గీ రాజా హెచ్చరించారు.