: సమంతతో నాకేం గొడవల్లేవ్: రాజమౌళి


తనకూ, హీరోయిన్ సమంతకు విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలపై టాలీవుడ్ టాప్ డైరక్టర్ రాజమౌళి స్పందించారు. ఆమెతో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ట్విట్టర్లో తాను సరదాగా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ కథనాలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. 'బాహుబలి'కి డేట్స్ అడిగితే సమంత నిరాకరించిందని తెలిపారు. దీంతో, తామిద్దరి మధ్య విభేదాలున్నాయని పలు వెబ్ సైట్లలో వార్తలొచ్చాయని పేర్కొన్నారు. "నీ అభిమానులు నాపై కోపగించుకునేలా చేశావు" అని ట్విట్టర్ లో సమంతను ఉద్దేశించి కామెంట్ చేశానని, దీన్ని ఆధారంగా చేసుకుని చిలువలు పలువలు చేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వార్తలు పట్టించుకోవద్దని రాజమౌళి ఫ్యాన్స్ కు సూచించారు.

  • Loading...

More Telugu News