: అమెరికాలో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ముప్పు


313 మంది ప్రయాణికులతో అమెరికాలోని న్యూజెర్సీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబై బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెనుముప్పు తప్పింది. ఏఐ-114ను పక్షి ఢీకొనడంతో ఎడమ ఇంజిన్ పాడైంది. దీంతో అరగంట తర్వాత విమానాన్ని వెనక్కు తీసుకొచ్చినట్టు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని... లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News