: ఢిల్లీ నుంచి కాత్రాకు ప్రతిరోజూ రైలు సర్వీసులు షురూ!


ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ లోని కాత్రాకు ప్రతిరోజూ రైలు సర్వీసులు ప్రవేశపెట్టినట్టు రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే వారికి ఈ రైలు ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. ‘శ్రీ శక్తి’ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరుతుంది. మరునాడు తెల్లవారుజామున 5.10 గంటలకు కాత్రా స్టేషనుకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. తిరిగి కాత్రా స్టేషన్ లో ఉదయం 10.55 గంటలకు బయల్దేరి, మరునాడు ఉదయం 10.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని రైల్వే అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News