: పాక్ నుంచి పట్టుకొస్తున్న... రూ.35 కోట్ల హెరాయిన్ ను పట్టేశారు


పాకిస్థాన్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న కోట్లాది రూపాయిల విలువ చేసే హెరాయిన్ ను పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న అమృత్ సర్ పోలీసులు తరణ్ తారణ్ లోని ఫతేహాబాద్ వద్ద కాపు కాసి... ఓ వాహనంలో తరలిస్తున్న ఏడు కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని నడుపుతున్న దల్బీర్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ బహిరంగ మార్కెట్లో రూ.35 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News