: సినీ నటి త్రిషను నిలదీసిన భద్రతాధికారులు
చెన్నై విమానాశ్రయంలో సినీ నటి త్రిషకు ఊహించని పరాభవం ఎదురైంది. హైదరాబాద్ రావడానికి ఉదయం 8 గంటలకు ఆమె చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఎయిర్ పోర్టులోని వారంతా ఈ ముద్దుగుమ్మను అభిమాన పూర్వకంగా చూస్తుంటే... భద్రతాధికారులు మాత్రం షాక్ ఇచ్చారు. ఐడెంటిటీ కార్డు చూపించమని అడిగారు. ఈ క్రమంలో త్రిషకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కొద్దిసేపటి తర్వాత పరిస్థితి ఎలాగోలా సద్దుమణిగింది. దీంతో, త్రిష విమానమెక్కింది.