: ఇరు జట్ల 11వ నెంబర్ బ్యాట్స్ మెన్ హాఫ్ సెంచరీలు చేయడం ఇదే ప్రథమం
నాటింగ్ హామ్ లో భారత్, ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ రూట్ (154*), అండర్సన్ (81)లు చివరి వికెట్ కు ఏకంగా 198 పరుగులు చేసి ప్రపంచ రికార్డును తిరగరాశారు. దీంతో 111 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ పేరు మీదే ఉన్న రికార్డు తుడిచిపెట్టుకు పోయింది. 1903లో ఆసీస్ పై ఫోస్టర్-రోడెస్ జోడీ పదో వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ మ్యాచ్ లో మరో రికార్డు నమోదయింది. ఇరు జట్ల 11వ నెంబర్ బ్యాట్స్ మెన్ హాఫ్ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ తరపున అండర్సన్, భారత్ తరపున షమీ (51) అర్ధశతకాలు పూర్తి చేశారు. 137 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇరు జట్ల 11వ నెంబర్ ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే ప్రథమం.