: వైకాపా నేత అంబటి రాంబాబుపై దాడి
వైకాపా నేత అంబటి రాంబాబుపై దాడి జరిగింది. గుంటూరు జిల్లా మేడికొండూరు సమీపంలో ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు ప్రయాణిస్తున్న అంబటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళుతుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో అంబటి రాంబాబు, ముస్తఫాలకు స్వల్ప గాయాలయినట్టు తెలుస్తోంది. వారు ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రస్తుతం మేడికొండూరులో ఉద్రిక్తత నెలకొంది.