: బాంబుల మోత వినిపించేది... కానీ ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు: నర్సులు
అల్లకల్లోల ఇరాక్ నుంచి మరో 29 మంది కేరళ నర్సులు క్షేమంగా తిరిగి వచ్చారు. దియాలాలోని బాఖుబా ఆసుపత్రిలో పని చేస్తున్న వీరంతా నిన్న కోచికి చేరుకున్నారు. ఎన్నో కష్టాలు పడి ఉద్యోగం కోసం ఇరాక్ వెళ్లామని... కానీ, ఇంతలోనే ఇలా తిరిగి రావాల్సి వస్తుందని ఊహించలేకపోయామని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బాంబుల మోత వినిపించేదని... కానీ, ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని చెప్పారు.