: సుప్రీంకోర్టులో పోలవరం బిల్లు ఓడిపోతుంది: జైపాల్ రెడ్డి
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ పార్లమెంట్ చేసిన బిల్లు సుప్రీంకోర్టులో వీగిపోతుందని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ముంపు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలపడం సరికాదని అన్నారు. కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండా బిల్లు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటుకు పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపే శక్తి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ బిల్లును సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని ఆయన తెలిపారు.