: ఏపీ సీఎస్ తో ముగిసిన పోలీసు ఉన్నతాధికారుల భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో పోలీసు ఉన్నతాధికారుల భేటీ ముగిసింది. హోం శాఖ సెక్రటరీ బి.ప్రసాదరావు, డీజీపీ జేవీ రాముడు ఈ సమావేశానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసుల పదోన్నతులపై వారు చర్చించారు. ఈ మేరకు కోర్టుకు ఎల్లుండి వారు ఓ నివేదిక సమర్పించనున్నారు.