: తెలంగాణలో కూడా టీడీపీనే అధికారంలోకి రావాలి: అశోక్ బాబు


హైదరాబాదుని అభివృద్ధి చేసింది ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కొనియాడారు. కేవలం రాజకీయ కుట్రతోనే ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా టీడీపీనే అధికారంలోకి రావాలని ఉద్యోగులమంతా మన:స్పూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. హైదరాబాదులో పనిచేయాలని సీమాంధ్ర ఉద్యోగులెవరూ భావించడం లేదని... ఆంధ్రప్రదేశ్ లో పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానసభలో మాట్లాడుతూ అశోక్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News