: సీఎం వస్తున్నారు.. నేతలు అరెస్టవుతున్నారు
విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో కొంత అభద్రతా భావం నెలకొంది. ఆయన ప్రతీ పర్యటనలోనూ భద్రతను పెంచుతున్నారు. ఎక్కడికెళ్లినా అక్కడి విపక్షాల నేతలను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ రోజు ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్, గాలి ముద్దు కృష్ణమ నాయుడు తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు. నేతల నిరసనల సెగ తగలకుండా ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.