: రుణమాఫీపై ఈ నెల 16లోగా స్పష్టత: మంత్రి ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ లో రైతుల రుణమాఫీపై ఈ నెల 16లోగా స్పష్టత వస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఆలోగా రుణాల రీషెడ్యూల్ పై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. గుంటూరులో 'ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టిషనర్స్ సౌత్ జోన్' సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మంగళగిరి వద్ద టీబీ శానిటోరియం స్థలంలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు.