: ఢిల్లీ వాసులకు 'స్మార్ట్' సౌలభ్యం


ఢిల్లీ వాసులకు ఓ కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే "ఏయ్, ఆటో" అని కేకలు వేయాల్సిన పనిలేకుండా, ఇకపై 'స్మార్ట్' గా పనిచక్కబెట్టుకోవచ్చు. ఇందుకోసం ఢిల్లీ రవాణా వ్యవస్థ ఓ యాప్ ను ప్రవేశపెట్టింది. దాని పేరు 'పూచ్-ఓ'. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఈ యాప్ ను నేడు ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా జీపీఎస్ వ్యవస్థ కలిగిన ఆటోలు నగరంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, సదరు ఆటో డ్రైవర్ కు కాల్ చేసే అవకాశం వినియోగదారులకు ఉంటుంది. కాగా, 'పూచ్-ఓ' ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ వినియోగదారులు మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.

  • Loading...

More Telugu News