: తిరుమలకు పోటెత్తిన భక్తులు... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు గంట గంటకూ భక్తులు పోటెత్తుతున్నారు. నేడు గురుపౌర్ణమి కావడంతో వైకుంఠంలో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కంపార్టుమెంట్ల వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 28 గంటల సమయం పడుతోంది. ఇక కాలినడకన వచ్చే భక్తులకు 12 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశదర్శనానికి ఎనిమిదిగంటల సమయం పడుతోంది. భక్తుల అధిక రద్దీ కారణంగా రేపు వీఐపీ బ్రేక్ దర్శనం నిలిపివేస్తున్నట్టు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు.