: కాణిపాకం ఆలయ గోడౌన్లలో నాసిరకం సరుకులు


కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకుడి ఆలయానికి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు అడ్డదారులు తొక్కుతున్న ఘటన శుక్రవారం వెలుగు చూసింది. స్వామి వారి ఏకాంత సేవకు వినియోగించే సరుకుల్లోనూ కాంట్రాక్టర్లు నాణ్యత పాటించని వైనంపై ఆలయ ధర్మకర్తల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వామి వారి ఆర్జిత సేవలకు వినియోగించే కుంకుమ పువ్వు కూడా నకిలీదేనని తేలడంతో కాంట్రాక్టర్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మండలి చైర్ పర్సన్ లతా రాజ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కుంకుమ పువ్వుకు బదులుగా కొబ్బరి తురుముకు రంగు వేసి సరఫరా చేస్తున్నా, దానిని గుర్తించడంలో అధికారులు విఫలమవడం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారుల పరోక్ష మద్దతుతోనే కాంట్రాక్టర్ ఈ మేర మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసాదం తయారీకి వినియోగించే పదార్థాల్లోనూ నాసిరకం సరుకులతో కాంట్రాక్టర్ ఏటా కోట్ల రూపాయలను కైంకర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News