: సాగునీటి ప్రాజెక్టులపై టీ-సీఎం కేసీఆర్ సమీక్ష
సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ నెల 17 నుంచి ప్రాజెక్టులు పరిశీలించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టులకు అవసరమైన భూముల కోసం కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నట్లు సమాచారం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులను సంప్రదించాకే ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరపాలని కేసీఆర్ చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలు, జూరాల-పాకాల ప్రాజెక్టు పనులను మూడు నెలల్లోగా ప్రారంభించాలని ఆయన అన్నారు.