: భార్య గొంతుకోసి చంపిన హోంగార్డు
హైదరాబాదు రామంతాపూర్ లో హోంగార్డు జానకీరాంరెడ్డి తన భార్య గొంతుకోసి హతమార్చాడు. జానకీరాంరెడ్డి మలక్ పేట పీఎస్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు.