: పోప్ సలహాదారుల్లో భారతీయుడు
భారతీయ కార్డినల్ ఆస్వాల్డ్ గ్రేసియస్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనను పోప్ సలహాదారుగా నియమిస్తూ నేడు వాటికన్ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. 68 ఏళ్ళ గ్రేసియస్ ప్రస్తుతం ముంబయి ఆర్చిబిషప్ గా సేవలందిస్తున్నారు. కాగా, నూతన సలహాదారుల బృందం పోప్ ఫ్రాన్సిస్ కు రోజువారీ కార్యక్రమాల్లో సాయపడుతుంది. అంతేగాకుండా కొత్త అపోస్టల్ రాజ్యాంగం రూపకల్పనలోనూ ఈ సలహాదారులు కీలకపాత్ర పోషిస్తారు. ఈ బృందంలో మొత్తం ఎనిమిది మంది కార్డినళ్ళు సభ్యులుగా ఉంటారు.