: మోడీ అత్యంత ప్రభావశీలి: అమెరికా


భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. మోడీ అత్యంత ప్రభావశీలత కలిగిన వ్యక్తిగా ఆ దేశ ప్రతినిధి మోడీని కీర్తించారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ శాఖ సహాయమంత్రి విలియమ్ బర్న్స్ ఒబామా పంపిన ఆహ్వాన లేఖను అందించేందుకు శుక్రవారం మోడీని కలిశారు. అనంతరం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. మోడీ ప్రభావశీలతను ప్రధానంగా ప్రస్తావించిన విలియమ్స్, గతంలో మోడీకి వీసా నిరాకరణ అంశంపై మాట్లాడేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. వీసా నిరాకరణ అంశం మోడీతో భేటీలో ప్రస్తావనకేమీ రాలేదన్న విలియమ్స్, భవిష్యత్తుపై దృష్టి సారిస్తున్న మోడీ ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News