: చిన్నారి కోసం ఇద్దరి తల్లుల ఆ(పో)రాటం


చిన్నారి పాప కోసం ఇద్దరు తల్లులు ఆరాటపడుతున్నారు... కాదు కాదు పోరాడుతున్నారు. ఓ వైపు పెంచిన తల్లి, మరో వైపు కన్నతల్లి... ఇద్దరి మధ్య ఆ చిన్నారి నలిగిపోతోంది. విజయవాడలోని సందీప్, విమల దంపతులు రెండున్నరేళ్ల నుంచి ఆ పాపను పెంచుకుంటున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతో వారు చిన్నారిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఆ చిన్నారి కన్నతల్లి నుంచే తాము దత్తత తీసుకున్నామని వారు చెబుతున్నారు. కాగా, ఆ పాపకు కన్నతల్లినంటూ చెన్నై నుంచి హేమలత అనే మరో మహిళ రావడంతో వ్యవహారం శిశు సంక్షేమ శాఖకు చేరింది. పాప అసలు తల్లి ఎవరో తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్ట్ కు పంపించాలంటూ శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. పాపను ఛైల్డ్ వెల్ఫేర్ సొసైటీకి తరలించారు. డీఎన్ఏ ఫలితం వస్తే కానీ ఆ పాపకు తల్లి ఎవరో తేలేలా లేదు.

  • Loading...

More Telugu News