: రుణ మాఫీకి కట్టుబడి ఉన్నాం: మంత్రి మృణాళిని
డ్వాక్రా రుణాల మాఫీకి తాము కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని చెప్పారు. రైతు రుణాల మాఫీపై నిర్ణయం తీసుకునే సమయంలోనే డ్వాక్రా రుణాలపైనా నిర్ణయం తీసుకుంటామని ఆమె శుక్రవారం చెప్పారు. పింఛన్ల లబ్దిదారుల విషయంలోనూ, ఇళ్ల మంజూరు విషయంలోనూ ఇకపై ఆధార్ కార్డులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇప్పటిదాకా మంజూరైన ఇళ్లపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, ఇది పూర్తయ్యాకే కొత్త ఇళ్ల మంజూరును పరిశీలిస్తామని ఆమె తెలిపారు.