: ప్రియురాలి ఇంటికే కన్నం వేశాడు!


డబ్బుపై దురాశ మనిషితో ఎంతటి పనైనా చేయిస్తుంది. అందుకు ఈ ఉదంతమే తగిన ఉదాహరణ. ఖమ్మం జిల్లాకు చెందిన ముజీబ్ (22) అనే యువకుడు బీటెక్ పూర్తి చేసిన అనంతరం మిత్రులతో కలిసి ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చాడు. ఓ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ముజీబ్ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ అమ్మాయి ముజీబ్ ను ఇంటికి పిలిచింది. ముజీబ్ వచ్చి పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు. ఎలా బతకాలంటూ సందేహం వెలిబుచ్చాడు. దీంతో, ఆ అమాయకురాలు ఇంట్లో ఉన్న నగలను ఆ వంచకుడికి చూపింది. దీంతో, ముజీబ్ లో దురాశ మొదలైంది. ఆ నగలన్నీ కొట్టేయాలని నిర్ణయించుకుని జూలై 7న మిత్రులు శివ, నరేశ్ లతో కలిసి ప్రియురాలి ఇంటి తాళాలు పగలగొట్టి అందినకాడికి దోచుకున్నారు. దీనిపై అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ నగలను సికింద్రాబాద్ జనరల్ బజార్ లో విక్రయించేందుకు వచ్చిన ముజీబ్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరం బట్టబయలైంది. ముజీబ్ తో పాటు అతని స్నేహితులిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News