: ఇవాళ ‘ఇంజనీర్ల డే’
ఇవాళ నవాబ్ అలీజంగ్ జయంతి సందర్భంగా... జులై 11వ తేదీని ‘ఇంజనీర్ల డే’గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాదులోని జలసౌధలో నవాబ్ అలీజంగ్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ కు 500 గజాల స్థలం, రూ.50 లక్షలు ఇస్తామని హరీష్ రావు ప్రకటించారు. తమది ‘ఎంప్లాయీ ఫ్రెండ్లీ’ ప్రభుత్వమని ఆయన పునరుద్ఘాటించారు.