: ఐటీ రంగానికి ప్రోత్సాహకంగా రూ.63 లక్షలు విడుదల చేసిన కేటీఆర్


తెలంగాణలో ఐటీ రంగానికి ప్రోత్సాహకంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 63 లక్షల రూపాయలు విడుదల చేశారు. తెలంగాణ ఐటీ శాఖ పెట్టుబడులు ఆకర్షించేందుకు దేశవిదేశాల్లో సదస్సులు, ప్రదర్శనలు, రోడ్ షోలు నిర్వహించనుంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను అందుకోసం వెచ్చించనున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గ్రామీణ పేదరిక నిర్మూలన పథకంపై సమీక్ష నిర్వహించారు. ప్రపంచబ్యాంకు భాగస్వామ్యంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు.

  • Loading...

More Telugu News