: పోలవరం ఆర్డినెన్సుకు లోక్ సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించింది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సవరణ బిల్లుకు సవరణలు ప్రతిపాదించగా... సభలో చర్చ జరిపి ఆమోదించారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్, టీ కాంగ్రెస్ తో పాటు ఒడిశా, చత్తీస్ గఢ్ కు చెందిన కొందరు ఎంపీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ... మెజారిటీ సభ్యులు బిల్లుకు మద్దతు పలికారు. దీంతో పోలవరం ఆర్డినెన్సుకు లోక్ సభలో ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో, ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ భూభాగంగా మారనున్నాయి. భద్రాచలం డివిజన్ లోని కుక్కునూరు, చింతూరు, వీఆర్ పురం, కూనవరం, వేలేరుపాడు, బూర్గంపాడు, భద్రాచలం రూరల్ మండలాలు ఏపీ అంతర్భాగాలయ్యాయి. అంతేకాకుండా, బూర్గంపాడులోని 6 కొత్త గ్రామాలను కూడా అదనంగా ఏపీలో చేర్చారు.