: వేసవికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు


వేసవి సెలవుల్లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మొత్తం 278 ప్రత్యేక రైళ్లు ఏర్పటు చేస్తున్నట్లు సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. కాగా, మరో 22 రైళ్లలో 63 అదనపు బోగీలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనివల్ల వెయిటింగ్ జాబితాలో ఉన్న ప్రయాణికులకు బెర్తుల సౌకర్యాన్ని కల్పించే అవకాశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాక వేసవిలో దళారీల ప్రమేయాన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజర్వేషన్ కేంద్రాల్లోనూ నిఘాను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరోవైపు రైల్వే స్టేషన్ లలో అదనపు బుకింగ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు. ప్రయాణికులు ఈ-టికెటింగ్ సదుపాయాన్ని వినియోగించేలా ప్రచారం కల్పిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News