: సినిమా ఛాన్స్ పేరుతో ఘరానా మోసం


సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ సికింద్రాబాదులో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ముంబయికి చెందిన మోడల్ సుప్రభను రాజు అనే వ్యక్తి హైదరాబాదుకి రప్పించాడు. ఇక్కడకు వచ్చాక కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చి ఒంటిపైనున్న బంగారు నగలను అపహరించాడు. జరిగిన మోసాన్ని గ్రహించిన మోడల్ సుప్రభ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని వెతికే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News