: రేపు మోడీ, జైట్లీతో సమావేశం కానున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన నిర్దేశించిన మేరకు జరుగుతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలిసిన జగన్, రేపు ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రిని కలవనున్నారు. ప్రధానితో సమావేశంలో టీడీపీ తీరుపై ఫిర్యాదు చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సాయంపై చర్చించనున్నారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఆర్థిక లోటుతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు కేటాయింపులు ఇవ్వాలని జగన్ సూచించనున్నారు.