: పోలవరంపై వెంకయ్యనాయుడుతో సుజనా చౌదరి భేటీ
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి భేటీ అయ్యారు. పోలవరం బిల్లు రేపు లోక్ సభలో చర్చకు రానుండడంతో లోక్ సభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని సహా, కేంద్ర మంత్రులంతా చెప్పడానికి తోడు, పోలవరం నిర్మాణాన్ని బిల్లులో పెట్టిందే కాంగ్రెస్ కావడంతో బిల్లు ఆమోదానికి ఆటంకాలు లేవు. కానీ, తెలంగాణ ఎంపీలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్లును ఎలా గట్టెక్కించాలనే దానిపై వెంకయ్యనాయుడుతో సుజనా చర్చిస్తున్నారు.