: యూపీఏ ప్రధానమంత్రి అభ్యర్ధిని ప్రకటించండి: శరద్ పవార్


వచ్చే లోక్ సభ ఎన్నికలకు ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరన్న దానిపై స్పష్టత కావాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏకు ఒత్తిడి మొదలయిందా? ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ మాటలు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. 2014 ఎన్నికల ప్రధాని అభ్యర్ధిని ప్రకటించాలని పవార్ ఈరోజు యూపీఏ నాయకత్వాన్ని డిమాండు చేశారు. భాగస్వామ్య పక్షాలతో ఓ సమావేశం ఏర్పాటుచేసి ప్రధాని అభ్యర్ధిపై చర్చించాలని ఆయన యూపీఏకు సూచించారు.

మహారాష్ట్రలోని థానేలో మీడియాతో మాట్లాడిన పవార్, తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని వెల్లడించారు. 9 మంది ఎంపీలున్న ఎన్సీపీ యూపీఏలో కీలక భాగస్వామి. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే యూపీఏ తదుపరి ప్రధాని అభ్యర్ధని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు ప్రధాని అభ్యర్ధిపై ఏదోఒకటి తేల్చాలని ఎన్డీఏపై జేడీ(యూ) ఒత్తిడి తెస్తున్న సంగతీ తెలిసినదే.

  • Loading...

More Telugu News