: సన్నబడాలంటే కడుపు మాడ్చుకోకూడదు: హుమా ఖురేషీ
చక్కనమ్మ చిక్కినా అందమే అనడానికి రుజువులా బాలీవుడ్ నటి హుమా ఖురేషీ తయారైంది. ఫెమినా మేగజీన్ కవర్ పేజీ ఫోటో కోసం నాజూగ్గా తయారైన హుమా ఖురేషీని బాలీవుడ్ నటులంతా "ఏమిటీ, డైటింగ్ మహిమా? ఇంతందంగా తయారయ్యావ్" అంటూ ఆరాలు తీయడంపై ఆమె స్పందించింది. సన్నబడడానికి కడుపు మాడ్చుకోనని, కష్టపడ్డానని తెలిపింది. తాను భోజన ప్రియురాలినని, తినకుండా తననెవ్వరూ ఆపలేరని స్పష్టం చేసింది. గతంలోలా జంక్ ఫుడ్ తినడం మానేశానని తెలిపింది. నాజూకుగా కనిపించేందుకు క్రమం తప్పకుండా యోగా, ఎక్సర్ సైజ్ చేస్తున్నానని హుమా వెల్లడించింది. తిండి మానేస్తే సన్నబడడం మాట అటుంచి రోగాలపాలవుతామని, అలాంటి వారిని చాలా మందిని తాను చూశానని ముక్తాయించింది.