: ’మహా‘ సీఎం మారనున్నారా?


మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కు పదవీ గండం తప్పదా? అంటే, అవుననే అంటున్నాయి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని పరిశీలిస్తున్న వర్గాలు. నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఘోరమైన ఫలితాలు చవిచూసింది. కొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు చవాన్ ను మార్చండంటూ ఎన్సీపీ ఆది నుంచి ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోంది. అటు, అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన చవాన్ నాయకత్వంలో ఎన్నికలకు వెళితే పార్లమెంట్ ఫలితాల్లాగే అసెంబ్లీలోనూ పరాజయం చవిచూడాల్సి వస్తుందని అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నపళంగా ఢిల్లీ రావాలన్న అధిష్ఠానం ఆదేశాలతో చవాన్ బుధవారం తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని మరీ హస్తినలో వాలిపోయారు. చవాన్ ను తప్పించిన పక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సుశీల్ కుమార్ షిండే, నారాయణ రాణే, రాధాకృష్ణ విఖే పాటిల్, బాలా సాహెబ్ థోరాట్, పతంగ్ రామ్ కదమ్ తదితరుల్లో ఎవరికో ఒకరికి పగ్గాలు అప్పజెప్పే అవకాశాలున్నట్లు కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News